AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తొక్కిసలాటలో గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతోంది. కాగా, నిన్న జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.