AP: మచిలీపట్నంలో ‘ప్రశ్న రావణ్’పై నమోదైన కేసులో దర్యాప్తు గడువును మరో 30 రోజులు పొడిగిస్తూ కృష్ణా జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద నమోదైన ఈ కేసులో నిందితుడు రావణ్‌కు సంబంధించి 90 రోజుల దర్యాప్తు గడువు రేపటితో ముగియనుంది. గడువు పొడిగించాలని కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ అనంతరం కోర్టు మరో 30 రోజుల గడువు మంజూరు చేసింది.