AP: నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావును విజయవాడలోని ఒక రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అతన్ని అక్కడికి తరలించారు. జనార్ధన్ రావు నోరు విప్పితే రాష్ట్ర స్థాయి నాయకుల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకుల అండదండలతోనే జనార్ధన్ రావు నకిలీ మద్యం తయారీకి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.