ఏపీలో పెట్టుబడులే లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గత ఏడాది రూ.13.50 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని, గత 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని చెప్పారు. ఎంఓయూలకే పరిమితం కాకుండా వాటిని వాస్తవ పెట్టుబడులుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. నవంబర్‌ 12, 13 తేదీల్లో పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘బిల్డ్‌ ఏపీ’ నినాదంతో రాష్ట్రాన్ని పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕