ఐపీఎస్ సంజయ్‍కు బెయిల్ మంజూరు

AP: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ సంజయ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్టు అయిన కొండలరావుకు కూడా బెయిల్ మంజూరు చేయబడింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్‌ అగ్నిమాపకశాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేసినప్పుడు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్