క్యాట్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్‌కుమార్‌కు చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టివేసింది. తీవ్ర అవినీతి ఆరోపణలు, కస్టోడియల్ టార్చర్, నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం వంటి కారణాలతో ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ విరమణను సస్పెన్షన్‌లోనే నోటిఫై చేసింది.