మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం.. మంత్రి వంగలపూడి అనిత

మాదక ద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నం రేంజ్‌లోని ఐదు జిల్లాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి ప్రారంభించారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గంజాయి రవాణా లేదా వాడకంపై వెంటనే 1972 నంబర్‌కు కాల్ చేయాలని, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్