AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పెద్ద ప్లానింగ్‌లో ఉన్నారా? వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని అనుకుంటున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అంబటి జైలుకెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను కాపు టైగర్ అని వైసీపీ అధినేత జగన్ అనడం, తన సామాజికవర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా రావడంతో అంబటి మనసులో కొత్త ఆలోచన పుట్టింది. కాపుల ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ తనకు తాను ఆ సామాజికవర్గానికి లీడర్‌గా ప్రమోట్ చేసుకుంటున్నారట.