AP: కూటమి ప్రభుత్వం మరో పది, పదిహేనేళ్లు కలిసే ఉంటుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా కూటమి ఒకటిగానే ఉంటుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. కూటమి లాంగ్ లీవ్ అంటూ పవన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. అయినప్పటికీ పిఠాపురం వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఈసారి ప్రత్యేకంగా మారాయి. జనసేన నేతలు.. టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి ముందుకు సాగకపోవడంతో పాటు అలయన్స్‌కు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని పవన్ దృష్టికి వచ్చిందట. దాంతో జనసైనికులకు పవన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.