ప్రభుత్వం ఉన్నది అమరావతి కోసమేనా: సజ్జల

AP: రాష్ట్రంలో ఐదు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నా, ప్రభుత్వం లేనట్లు నటిస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే ఈ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. 'అమరావతికి మాత్రం పెట్రోల్ సరఫరా ఆపొద్దట. ప్రభుత్వం ఉన్నది ఏపీ కోసమా లేక అమరావతి కోసమా? అమరావతిలో కాంట్రాక్టర్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై చూపడం లేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం లేదు' అని ఆయన ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్