ఏపీలో పేదలకు ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు?

ఏపీ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందించేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద రాష్ట్రానికి నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరో వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో ఈ ఇళ్ల మంజూరుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్