తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వరుస సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన నిర్మాణ సంస్థలపై కేసులు, గన్‌మెన్ తొలగింపు, సోదరుడు రాజశేఖర్ రెడ్డి అరెస్టు వంటి పరిణామాలతో ఆయన రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాక్రీట్ సంస్థ అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, హనీ ట్రాప్ కేసులో సాక్ష్యాధారాలు ఇవ్వాలని పోలీసుల నోటీసులు, పాపంపేట భూ వివాదంలో జోక్యం వంటివి ఈ సమస్యలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలన్నీ యాదృచ్చికమా లేక పథకం ప్రకారమా అన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది. పోలీసులు మాత్రం భద్రతా సమీక్షలో భాగంగానే గన్‌మెన్‌ను తొలగించామని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్