విశాఖలో సముద్రం రంగు మారుతోంది. నీలిరంగులో కనిపించే సముద్రం.. భీమిలి తీరంలో కొంత భాగం లేత ఎరుపు వర్ణంలో కనిపించింది. దీంతో ఆ నీటిని పరిశీలించే పనిలోపడ్డారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషణోగ్రఫీ శాస్త్రవేత్తలు. భీమిలితోపాటు విశాఖ ఆర్కే బీచ్ లోను కొంత భాగం సముద్రంలో రంగు మారినట్లు కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు, అధికారులు పరిశోధన ప్రారంభించారు. సముద్రపు కెరటాల తాకడికి సముద్రపు తీర ఎర్ర మట్టి సముద్రంలో చేరి అంత భాగం ఎర్రగా మారినట్టు నిర్ధారించారు.