జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఎక్సైజ్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు కస్టడీ విచారణలో జనార్దన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు జోగి రమేశ్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జోగి రమేశ్‌కు నోటీసులు ఇచ్చి.. విచారణ జరపనున్నట్లు తెలిసింది. ఏ క్షణమైనా జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్