ఏపీ ఆర్థిక వృద్ధిపై మాజీ CM జగన్ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై మాజీ CM జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల CAG గణాంకాలను Xలో షేర్ చేసిన ఆయన, 2 ఏళ్లలో రాష్ట్ర పన్నుల వృద్ధి CAGR కేవలం 2.75% మాత్రమే ఉండగా, ప్రభుత్వం చెబుతున్న 12-15% వృద్ధి పూర్తిగా అవాస్తవమని అన్నారు. తమ ప్రభుత్వ కాలంలో పన్నుల వృద్ధి 9.87% నమోదైందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ కాలంలో అప్పులు భారీగా పెరిగి ₹2,06,959 కోట్లకు చేరాయని, మీ విజన్ ఇదేనా చంద్రబాబు అని జగన్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్