AP: మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం రాజకీయాలకు స్వస్తి పలకడం లేదా పార్టీ మారడంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అధిష్ఠానం వ్యవహరిస్తున్న శైలి, తాడేపల్లి కీలక సమావేశానికి దూరంగా ఉండటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. జగన్ తన పట్ల చూపుతున్న ఉపేక్షతో అసంతృప్తిగా ఉన్న ఆయన, కొడుకు భవిష్యత్తు కోసం జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కోట్ల రూపాయల భూ -కబ్జా వ్యవహారంలో ఆయన కుటుంబంపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.