AP: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నీడను చూసేందుకు కూడా వైఎస్ జగన్ ఇష్టపడటం లేదని రాజకీయంగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న హైదరాబాద్‌లోని కొత్వాల్‌గూడలో షర్మిల కుమార్తె అంజలి-రఘు నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జగన్ హాజరుకాలేదు. దాంతో ఈ వార్త రాజకీయంగా చర్చనీయాంశమైంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు.. షర్మిలతో కలవడానికి వైఎస్ జగన్ ససేమిరా వద్దన్నట్లు తెలిసింది. కనీసం షర్మిల నీడను చూసేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదని సమాచారం.