AP: విశాఖపట్నంలోని మరికవలసలో ఉన్న విశ్వనాథ్ అవెన్యూలోని ఓ అపార్ట్మెంట్లో ఐటీ ఉద్యోగి గోరాపల్లి చైతన్య (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మధురవాడ ఐటీ సెజ్లోని ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీలో చైతన్య పనిచేస్తున్నారు. మరణానికి కుటుంబ తగాదాలే కారణమని సమాచారం. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.