AP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేయడం సీఎం చంద్రబాబు తరం కాదని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నారని మంత్రి తెలిపారు. "రప్పా.. రప్పా అనొద్దని కార్యకర్తలకు చెప్పా. 8వ తేదీన మాట్లాడితే.. 12న టీడీపీ శ్రేణులు హడావుడి చేశారు. చీకట్లో నరకమని చెప్పానంటూ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు." అని పేర్ని నాని వెల్లడించారు.