మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి: సీఎం చంద్రబాబు

AP: "మనమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేదే భారతీయ సంస్కృతి" అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు ఇస్తున్నవారు పెరుగుతున్నారని తెలిపారు. పిల్లలు ఎంత పెద్దవాళ్లయినా జీవితాంతం వారికి అవసరమైన సహాయం అందించే సంస్కృతి మనదేనన్నారు. రూ.100 కోట్ల వ్యయంతో మాతా–శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్