ధనుంజయరెడ్డిని వేధిస్తున్నారన్న జగన్ మాటలు వినడానికే కంపరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. మద్యం కుంభకోణంలో నిందితుడు ధనుంజయరెడ్డిని మచ్చలేని అధికారిగా ప్రశంసించడం సిగ్గు చేటన్నారు. ‘జగన్.. నీకు ఆయనపై అంత ప్రేమ ఉంటే సీబీఐకి లేఖ రాయగలవా? ఆటవిక రాజ్యంగా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది చంద్రబాబు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదు’ అని మండిపడ్డారు.