అదంతా అబద్ధపు ప్రచారం.. భక్తులు నమ్మొద్దు: టీటీడీ

తిరుమలలో వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఖండించింది. ఇలాంటి వదంతులు, పుకార్లను నమ్మవద్దంటూ టీటీడీ శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది.

సంబంధిత పోస్ట్