AP: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గూడెం చెరువులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావేదికలో మాట్లాడుతూ.. చెడగొట్టడం.. పడగొట్టడం సులభమని, కానీ నిలబెట్టడం కష్టం అంటూ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారని, కేంద్ర పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. తల్లికి వందనం హామీని నిలబెట్టుకున్నామని, ఏడుగురు పిల్లలున్నా ఇచ్చామన్నారు.