AP: పులివెందులలో తన కార్యకర్తలనుద్దేశించి మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. పులివెందులలో కొడితే రాష్ట్రం మొత్తం సౌండ్ వినిపించాలని కార్యకర్తలకు సూచించారు. తమ నేతలపై చేయి వేసే పోలీసులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెండేళ్ల తర్వాత జగన్ 2.0 ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.