జగన్, స్టాలిన్ స్నేహం.. తమిళనాడు ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఉంటుందా?

తమిళనాడులో త్వరలో జరగనున్న ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశాలు, వైసీపీ మాజీ మంత్రి రోజా స్టాలిన్ పుట్టినరోజు వేడుకలకు హాజరుకావడం వంటి పరిణామాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. స్టాలిన్, జగన్ రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే జగన్ రెడ్డి బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, తమిళనాడు ఎన్నికల కోసం ఆ సంబంధాలను దూరం చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లోని ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలని స్టాలిన్ భావిస్తున్నారని అంటున్నారు.

సంబంధిత పోస్ట్