AP: మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పందించారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘ముందుగా జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదు. ఖోఖో అధికారులను సంప్రదిస్తే సర్టిఫికెట్ ఫేక్ అని తేలింది. నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు. 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు? ఏం తనిఖీ చేశారు?’ అని జగన్ ట్వీట్ చేశారు.