AP: మంత్రి లోకేష్ ఆదేశాలతో పోలీసులు వైసీపీ అధినేత జగన్ కు భద్రత కల్పించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ మేరకు జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని రాంబాబు తెలిపారు. వంశీని పరామర్శించడానికి లేని కోడ్ విజయవాడ రైతులను పరామర్శించడానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మాజీ సీఎంకు జెడ్ ప్లస్ భద్రత ఉందని కానీ ఒక్క పోలీస్ కూడా రాలేదన్నారు.