సీఎంఆర్ఎఫ్ నిధులను జగన్ పక్కదోవ పట్టించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైసీపీ హయాంలో పేదలకు వైద్య సాయం అందించలేదన్నారు. పాలకొల్లులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. 82 మంది పేదలకు రూ.61 లక్షల విలువైన చెక్కులను అందజేశామన్నారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయిన వనరులను దోచుకోవడానికే జగన్ ఆరాట పడుతున్నారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.