AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో కీలక బాధ్యతలు దక్కించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాయకత్వ బాధ్యతలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఆయన సొంత నియోజకవర్గ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. పార్టీ, అధికారిక కార్యక్రమాలకు పిలుపు లేకపోవడంతో ప్రైవేట్ సమావేశాలతో కాలం వెల్లదీస్తున్నారు. సామాజిక లెక్కల ప్రకారం, అనిల్ కుమార్ యాదవ్ వైఖరి వల్ల రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీని వీడారని, నెల్లూరులో పార్టీకి నష్టం వాటిల్లిందని జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్లు సమాచారం.