AP: టీచర్లపై రౌడీషీటర్లను ఉసిగొల్పడం దారుణమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ దాడులతో జగన్ నేర మనస్తత్వం మరోసారి బయటపడిందన్నారు. టీచర్లపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.