AP: మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ విమర్శలు గుప్పించింది. జగన్ వద్ద అద్భుతమైన స్కీములు చాలానే ఉన్నాయని ఎద్దేవా చేసింది. ఒకప్పుడు రూ.7 కోట్లుగా ఉన్న జగన్ ఆస్తులు.. ఆయన తండ్రి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన సమయంలో రూ.లక్ష కోట్లకు చేరాయని టీడీపీ తన ట్వీట్లో ఆరోపించింది. అలాగే జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయన వద్ద పీఏగా పనిచేసిన కె. నాగేశ్వరరెడ్డి (KNR) ఆస్తులు రూ.కోటి నుంచి రూ.1,000 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ సంపద పెరుగుదల వెనుక ఉన్న స్కీమ్ (స్కామ్) ఏమిటో జగన్ను అడగాలంటూ టీడీపీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.