వైసీపీలో కదలిక మొదలైంది. నిన్నటి దాకా పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉంది. వైసీపీలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుం బిగించారు అని అంటున్నారు. పార్టీలో దాదాపుగా వంద దాకా అసెంబ్లీ సీట్లలో మార్పులు భారీ ఎత్తున చేసి కూడా చేదు ఫలితాలు మూటకట్టుకున్న జగన్ ఇపుడు నియోజకవర్గాల ఇంచార్జిల నియామకాలను కొత్తగా చేపడుతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలు పాత. కొత్త వారితో నియమిస్తారని.. ఆ మీదట రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటిస్తారని అంటున్నారు.