ఏపీలో ఇద్దరు ముఖ్య నేతలు నిన్న పొలం బాట పట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికార, విపక్ష నేతలు వేర్వేరుగా అన్నదాతలతో సమావేశమయ్యారు. శంకరగుప్తంలో సముద్రపు నీరు చేరి పాడవుతున్న కొబ్బరి తోటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పులివెందుల నియోజకవర్గం బ్రాహ్మణపల్లెలో అరటి తోటలను మాజీ సీఎం జగన్ పరిశీలించారు. ఇద్దరు నేతలు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే పవన్, జగన్ పర్యటనలతో కొబ్బరి, అరటి రైతులకు మేలు జరుగుతుందా? లేదా? అనేది వేచిచూడాలి.