AP: ఒకప్పుడు జగన్ కు తోడునీడగా ఉన్నానని, అయితే జగన్ తనను 74 రకాలుగా అవమానించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రెండు అవమానాలు తనను తీవ్రంగా బాధించాయని, వాటి కారణంగానే వైసీపీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా తనను నియమించి, సజ్జల రామక్రిష్ణారెడ్డిని రాష్ట్ర కోఆర్డినేటర్ గా తనకంటే ముందు నియమించడం ఒక అవమానమని, అలాగే ప్రధాని మోడీకి తన ఢిల్లీ అపాయింట్మెంట్లు చూసే బాధ్యతను తీసేసి, జవహర్ రెడ్డికి అప్పగించారని చెప్పడం మరో అవమానమని ఆయన వివరించారు. ఈ అవమానాల వల్లే మనసు విరిగి పార్టీని వీడానని, తిరిగి చేరేది లేదని స్పష్టం చేశారు.