AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకట్టగా నిలిపారని విమర్శించారు. పేద విద్యార్థుల డాక్టర్ కావాలనే కలలకు జగన్ అడ్డుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు కోటాకు 50 శాతం సీట్లు కేటాయించడం ద్వారా పేదలకు అవకాశాలు తగ్గాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి అని ఆరోపించారు.