AP: మాజీ సీఎం జగన్ పై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు షాకింగ్ కామెంట్స్ చేశారు. బందిపోటు దొంగల కంటే జగన్ ప్రమాదకరమైన వ్యక్తి అని ఆరోపించారు. పల్నాడు జిల్లా వినుకొండలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న జీవీ మాట్లాడుతూ.. రూ.3,700 కోట్ల అక్రమార్జన కోసం జే బ్రాండ్లు తాగించి ప్రజల ప్రాణాలు బలిగొన్నారంటూ మండిపడ్డారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా పరామర్శించడం దారుణమన్నారు.