సీఎం చంద్రబాబు సంయమనం పాటించడం వల్లే జగన్ ఇంకా రోడ్లపై తిరుగుతున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. చంద్రబాబుది జగన్ లాంటి కక్ష సాధింపు వ్యక్తిత్వం కాదని.. ఏపీలో కక్ష సాధింపు సంస్కృతి తెచ్చిందే జగన్ అని విమర్శించారు. వైసీపీ కక్ష సాధింపు జాబితా పంపుతానని, జగన్ చదువుకోవాలని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో కూటమి నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు.