జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం: గుడివాడ అమర్నాథ్

AP: స్థానిక ఎన్నికల్లో 'జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం' అనే నినాదంతో ముందుకు వెళ్తామని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. ఏలూరులో జరిగిన వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, భూములు, డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్మకానికి పెడుతోందని ఆరోపించారు.  చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజాభిమానం లేదని విమర్శించారు. వైసీపీ మాత్రం వైఎస్ జగన్‌‌పై ఉన్న ప్రజాభిమానంతో ఎన్నికలను ఎదుర్కొంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕