రాజారెడ్డి రక్తచరిత్రను జగనే ప్రస్తావించారు: లోకేశ్‌

AP: గొడ్డలి పార్టీ నేతలే విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాలేదని, ఎన్ని కేసులు వేసినా న్యాయస్థానం క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలిపారు. డీఎస్సీపై నియామకాలు జరిగిన 6 నెలల తర్వాత దుష్ప్రచారం చేస్తున్నారని, రాజారెడ్డి రక్తచరిత్రను జగనే ప్రస్తావించి ప్రజలకు తెలిసేలా చేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో సంస్కరణలకు తెలుగుదేశం నాంది పలికిందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్