AP: వైసీపీ అధినేత జగన్‌కు రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులో సోమిరెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్‌దని విమర్శించారు. వ్యవసాయ శాఖను జగన్ హత్య చేశారని, సూక్ష్మ సేద్యం, పోషకాలు, ఇతరత్రా రైతు ప్రోత్సాహకాలు దూరం చేశారని ఆగ్రహించారు. జగన్ వల్ల వ్యవసాయ రంగం ఎంత నష్టపోయిందో రైతులే చెబుతారని అన్నారు.