AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే నియోజకవర్గ ఇన్చార్జిలకు టికెట్లు ఇవ్వనని వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే పులివెందుల నియోజకవర్గంపై టీడీపీ దృష్టి సారించి, అక్కడ ఏకగ్రీవాలకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం. ఒకవేళ పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటే, YCP డిఫెన్స్‌లో పడుతుందని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫార్ములాను అనుసరించనున్నారని తెలుస్తోంది.