AP: గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 88వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన అమృత గాత్రంతో సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. వేలాది పాటలు ఆలపించినా ప్రతి పాటలో కొత్త భావాన్ని, అనుభూతిని పంచిన మహా గాయకుడని కొనియాడారు. ఇక తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.