AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత జగన్‌ను అరెస్ట్ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని హోంమంత్రి అనిత బదులిచ్చారు. ‘లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఎవరు నీతిమంతులో? ఎవరు నిజాయితీపరులో? కోర్టులు చెబుతాయి. దీనిపై తొందరపడాల్సిన పని లేదు. దర్యాప్తు ముగిశాక.. చివరగా ఏం జరిగిందనే విషయంపైనే మాట్లాడుకోవాలి.’ అని అన్నారు.