జగన్‌ నెల్లూరుకు రావడం తథ్యం: అనిల్‌

AP: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్‌ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్‌ నెల్లూరుకు రావడం తథ్యమన్నారు. "జులై 3న వైఎస్‌ జగన్ పర్యటనకు హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా టీడీపీ అడ్డంకులు కలిగిస్తోంది. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు." అని అనిల్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్