వైసీపీ కార్యకర్తలకు జగన్ భారీ హామీ

AP: వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే పాలన మొత్తం కార్యకర్తల చేతుల మీదుగానే చేయిస్తామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో వారి మాటే చెల్లుబాటు అవుతుందని మాజీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. 2009 నుంచి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కలేదనే ఆవేదన నేపథ్యంలో ఈ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమికి క్యాడర్ నిర్లిప్తతే కారణమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్‌తో నేరుగా సమావేశాలు నిర్వహించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని సూచనలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్