అమరావతిపై మారిన జగన్ ప్లాన్.. తాజాగా మరో కీలక నిర్ణయం

AP: రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి, భారీ ఖర్చులపై విమర్శలు చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్, తాజాగా అమరావతి రైతుల సమస్యలపై దృష్టి సారించారు. భూ సమీకరణ, గతంలో ఇచ్చిన హామీల అమలుపై రైతులు తనను కలిసి వినతిపత్రం అందించడంతో, సీఆర్డీఏ పరిధిలో రైతులకు న్యాయ సహాయం అందించేందుకు పార్టీ నేతలు, న్యాయవాదులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే డీఎస్సీ పరీక్షల అంశంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు మరో కమిటీని కూడా నియమించారు. అమరావతి ప్రాంతంలో పార్టీ పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్