జగన్ కోడి కత్తి కేసు‌.. తుది తీర్పు ఇవ్వనున్న హైకోర్టు

AP: 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో YCP అధినేత వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసు విచారణ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు ఇప్పటికే ఆరేళ్లకు పైగా శిక్ష అనుభవించాడు. కుట్ర కోణం లేదని గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగితే అక్కడి ఎన్ఐఏ కోర్టులోనే విచారణ జరపాలని, విజయవాడలో ఎన్ఐఏ కోర్టు తీర్పు ఎలా ఇస్తుందని, కుట్ర కోణాన్ని వెలికితీయాలని జగన్ కోరారు.

సంబంధిత పోస్ట్