AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన పులివెందులలో గట్టి షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు శుక్రవారం పులివెందులలోని జమ్మలమడుగులో పర్యటించగా.. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పుష్పనాథ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. సీఎం మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే ఉండనున్నారని, ఈ క్రమంలో వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి చేరికలు జరగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.