AP: మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ను జగన్ పరామర్శించడాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తప్పుబట్టారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? మాజీ ఎమ్మెల్యేను జగన్ పరామర్శించడం చూసి సభ్యసమాజం మరోసారి తలదించుకుంటుంది. ఇలాంటి వైసీపీ నాయకులకా మనం ఐదేళ్లు పట్టం కట్టింది’ అని ప్రజలు ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేనికి మీ ఓదార్పు యాత్రలు, ఇలాంటి వారిని పరామర్శించేందుకా? అని ప్రశ్నించారు.