AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో జగన్ కుటుంబమే లబ్ధి పొందిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ‘వివేకా కేసులో దాయడానికి ఇంకేం లేదు. నోరు విప్పాల్సింది జగన్ మాత్రమే. వివేకా హత్య రహస్యం ఏంటో జగన్ చెప్పాలి. సునీల్ యాదవ్ చెప్పిన విషయాలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?’ అని అన్నారు.